ముంబై నగరంలో అమితాబ్ బచ్చన్ నివాసం, బీఎస్ఈ కార్యాలయం, వర్లీ రేస్ కోర్సులకు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నగరవ్యాప్తంగా భారీ తనిఖీలు చేపట్టారు. అమితాబ్ బచ్చన్ నివాసంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు ధృవీకరించారు. అక్టోబర్ 23న కూడా ఆయన నివాసానికి ఇలాంటి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పోలీసులు కఠినతరం చేశారు.