విమానం గాల్లో ఉండగా బాంబు బెదిరింపులు

29చూసినవారు
విమానం గాల్లో ఉండగా బాంబు బెదిరింపులు
ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ నుంచి వియన్నాకు బయల్దేరిన ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌బస్‌ ఏ320 విమానానికి గాల్లో ఉండగా బాంబు బెదిరింపు వచ్చింది. రొమేనియా సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో సమాచారం అందడంతో పైలట్లు విమానాన్ని బల్గేరియా రాజధాని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. విమానం దిగే వరకు బల్గేరియా వైమానిక దళానికి చెందిన ఫైటర్‌ జెట్‌ ఎస్కార్ట్‌గా వచ్చింది. ప్రయాణికులను దించిన అనంతరం తనిఖీలు చేపట్టగా అనుమానాస్పద వస్తువు కనిపించడంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్