
వరల్డ్ ఆర్చరీలో భారత్ సత్తా.. 13 పతకాలతో మెరిసిన క్రీడాకారులు
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టోమన్ కుమార్తో కలిసి మిక్స్డ్ టీమ్లో కాంస్యం సాధించింది. పారాలింపిక్ ఛాంపియన్ హర్విందర్ సింగ్, భావనతో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్లో స్వర్ణం గెలిచారు. భావన వ్యక్తిగత విభాగంలో కాంస్యం, సరిత, టోమన్ కుమార్ కూడా కాంస్య పతకాలు సాధించారు. చివరి రోజున రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు భారత్కు దక్కాయి.




