బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను ప్రభావంతో ఒడిశాలోని గంజాం జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రసవ సమయం దగ్గరగా ఉన్న గర్భిణులను అధికారులు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో అన్సుప గ్రామానికి చెందిన ఓ గర్భిణి మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తుఫాను సమయంలో పుట్టడంతో కుటుంబ సభ్యులు ఆ చిన్నారికి ‘అర్నబ్’ అని పేరు పెట్టారు. అదే పేరుతో జనన ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసినట్లు వైద్యులు తెలిపారు.