ఆడుకుంటూ వెళ్లి.. కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

38చూసినవారు
ఆడుకుంటూ వెళ్లి.. కరెంట్ షాక్‌తో బాలుడు మృతి
TG: ఖమ్మం జిల్ల కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న రమేష్, మమత దంపతుల 9 నెలల కుమారుడు అవేద్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వర్షం కారణంగా ఎర్త్ పైపుపై ఉన్న స్టీల్ ప్లేట్‌కు విద్యుత్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఆడుకుంటూ వెళ్లి ప్లేట్‌ను పట్టుకోవడంతో పసికందుకు విద్యుత్ షాక్ తగిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్