ఉద్యోగ అవకాశాల కోసం కేరళ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ప్రేమజంట మధ్య జరిగిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. నగరంలోని ఓటీసీ రోడ్డులో ఉన్న రెజెన్సీ లాడ్జ్‌లో గంగా (22) అనే యువతిని, ఆమె ప్రియుడు గోకుల్ కృష్ణ (23) కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు గోకుల్ కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.