తమిళనాడు తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో 24 ఏళ్ల మణిమేఖలై హత్యకు గురైంది. ఆమె ప్రియుడు ఏపీలోని సురుట్టపల్లికి చెందిన దుర్గాప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సూపర్వైజర్తో మణిమేఖలై మాట్లాడటంపై దుర్గాప్రసాద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రెండేళ్లుగా ఉన్న ప్రేమ వ్యవహారంలో విభేదాలు తలెత్తినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ వాగ్వాదం జరగడంతో కత్తితో ఆమె గొంతు కోసి, ముఖంపై పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.