మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో అనురాగ్ యాదవ్, యోగితల వివాహ వేడుకలో చెప్పుల దొంగతనం వ్యవహారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెళ్లిలో వరుడి తరపు వారి చెప్పులు కనిపించకుండా పోవడంతో, పరిహారం కింద రూ. 11,000 నుండి రూ. 25,000 వరకు వధువు తరపు వారు డిమాండ్ చేశారు. చివరకు రూ. 1,100 ఇస్తామని చెప్పడంతో వివాదం పెరిగి, ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వధువు చొప్పులతో వరుడిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.