భారీగా తగ్గిన బంగారం ధరలు

82చూసినవారు
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,570 పడిపోయి రూ.1,30,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,350 తగ్గి రూ.1,19,800 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర కూడా భారీగా దిగొచ్చింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,80,000 పలుకుతోంది. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్