పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పాటియాలా-సంగ్రూర్ బైపాస్‌పై పసియానా గ్రామం సమీపంలో భాక్రా కాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో రెండు భారీ లారీలు వంతెనపై చిక్కుకుని కాలువపై వేలాడుతున్నాయి. వాటిలో ఒక లారీకి మంటలు అంటుకున్నాయి. ప్రమాదం నేపథ్యంలో అధికారులు వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం జరిగిందా అనే విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.