అదిలాబాద్‌లో నేడు BRS రైతు గర్జన సభ

14చూసినవారు
అదిలాబాద్‌లో నేడు BRS రైతు గర్జన సభ
ఉత్తర తెలంగాణలో రైతు గర్జన సభలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతు గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నార్సింగి నివాసం నుంచి ఆదిలాబాద్‌కు బయలుదేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు బోథ్ నియోజకవర్గం తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్ డైట్ కాలేజ్ గ్రౌండ్‌లో రైతు గర్జన సభకు హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్