2028లో బీఆర్ఎస్‌దే అధికారంలోకి వస్తుంది: కేటీఆర్

9చూసినవారు
2028లో బీఆర్ఎస్‌దే అధికారంలోకి వస్తుంది: కేటీఆర్
తెలంగాణలో 2028లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల అమలుపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూ, ఆయన ఢిల్లీకి సంచులు మోయడంలో బిజీగా ఉన్నారని, 2028 డిసెంబర్ నాటికి ఆయన రాజకీయ ఏటీఎం కాలపరిమితి ముగుస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసులతో కాలయాపన తప్ప అభివృద్ధి శూన్యమని కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్