TG: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో
బీఆర్ఎస్ మరియు
కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను చించివేయడంతో ఆగ్రహించిన ఆ పార్టీ శ్రేణులు, వరంగల్ పశ్చిమ
కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాళ్లు, కోడిగుడ్లతో పరస్పర దాడులు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.