సూడాన్‌లో దారుణ వైమానిక దాడులు.. 300 మంది మృతి

11చూసినవారు
సూడాన్ సైన్యం జరిపిన భీకర వైమానిక దాడుల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. సూడాన్, దక్షిణ సూడాన్ మధ్య వివాదాస్పద ప్రాంతమైన అబ్యేలోని మార్కెట్‌పై డ్రోన్లతో జరిపిన దాడిలో 153 మంది మరణించినట్లు సమాచారం. అంతేకాకుండా, వెస్ట్ కొర్దోఫన్‌లోని రెండు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో మరో 150 మంది మృతి చెందినట్లు 'సూడాన్ వార్ అబ్జర్వేటరీ' తెలిపినట్లు BBC కథనం పేర్కొంది. ఈ దాడులు తీవ్ర విషాదాన్ని నింపాయి.

సంబంధిత పోస్ట్