ఢిల్లీలోని వికాస్ నగర్లో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి పని నిమిత్తం మరో రాష్ట్రానికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల కుమార్తెపై సొంత తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, మానవ మృగంలా ప్రవర్తించి కుమార్తెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు పొరుగింటి వారికి విషయం తెలపడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.