TG: హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం పాల వ్యాపారి భుజంగరావు (60) దారుణ హత్యకు గురయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భుజంగరావును కొందరు దుండగులు వెంబడించి కత్తితో మెడపై నరికి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.