పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో హెడ్ కానిస్టేబుల్ వినోద్‌కుమార్ (42) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి వినోద్‌కుమార్‌కు లిఫ్ట్ ఆఫర్ చేసినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మన్‌కౌర్ బైపాస్ సమీపంలో వినోద్ కుమార్ విగతజీవిగా కనిపించారు. ఆయన తలలో బుల్లెట్ గాయం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్యకు తామే బాధ్యులమంటూ ‘తెహ్రీక్-ఎ-తాలిబన్ హిందుస్థాన్’ అనే సంస్థ ప్రకటించింది.