TG: భద్రాచలంలోని ఓ లాడ్జిలో సోమవారం అర్ధరాత్రి ఓ గిరిజన యువకుడు దారణ హత్యకు గురయ్యాడు. లాడ్జి సిబ్బంది, ముగ్గురు గిరిజన యువకులు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో లాడ్జి సిబ్బంది కొట్టడంతో శరత్(24) అనే యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.