
గర్భిణీ భార్యకు బలవంతంగా యూరియా తాగించి.. ఉరేసి చంపిన భర్త
గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మితుల్ సోధా అనే వ్యక్తి తన గర్భవతి అయిన భార్య అరుణాబెన్‌ను అనుమానంతో కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేశాడు. నిందితులు అరుణాబెన్ చేతులు, కాళ్లు పట్టుకుని బలవంతంగా నానో యూరియా తాగించి చంపేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని కిటికీకి వేలాడదీసి, సాక్ష్యాలను తగులబెట్టారు. పోస్టుమార్టం నివేదికలో నిజం బయటపడటంతో, మృతురాలి సోదరుడు వీరేంద్రసింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని, ఘటనపై విచారణ చేపట్టారు.




