TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లైవ్ బుల్లెట్ కలకలం రేపింది. దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ఓ ప్రయాణికుడి బ్యాగులో సజీవ తూటాను భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రయాణికుడిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.