మహారాష్ట్రలో ఛత్ పూజ పండుగ రద్దీ నేపథ్యంలో 'ఆపరేషన్ సతర్క్' కింద తనిఖీలు చేపట్టిన రైల్వే రక్షణ దళం (RPF) నాసిక్ రోడ్ స్టేషన్‌లో భారీగా నగదును పట్టుకుంది. 3వ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన అమృత్
భారత్ ఎక్స్‌ప్రెస్ (22112) తనిఖీల్లో ఓ యువకుడి బ్యాగులో లెక్కల్లో చూపని రూ.1,48,64,000 నగదు బయటపడింది. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.