బుర్కినా ఫాసో దేశంలో అందాల పోటీలపై నిషేధం

0చూసినవారు
బుర్కినా ఫాసో దేశంలో అందాల పోటీలపై నిషేధం
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అందాల పోటీలపై నిషేధం విధించింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందని, కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని సైనిక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, ఉగ్రవాదం, దేశద్రోహం, గూఢచర్యం వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్షను పునరుద్ధరించింది. 2018లో రద్దు చేసిన ఉరిశిక్షను తిరిగి తీసుకురావడంపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యువతుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ పోటీలు నిర్వహించడం గమనార్హం.

సంబంధిత పోస్ట్