ఇటలీ ప్రభుత్వం తరగతి గదుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించడంతో పాటు పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్ ధరించడాన్ని నిషేధించేందుకు సిద్ధమైంది. ప్రధాని జార్జియా మెలోని ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ
విద్యార్థులు అధికంగా ఉన్న తరగతుల్లో భాషా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇటాలియన్ పిల్లలు తమ తరగతుల్లో మైనారిటీలుగా భావించే పరిస్థితి రాకూడదని ఆమె పేర్కొన్నారు. అలాగే ఇటాలియన్ భాష తెలియని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాష నేర్చుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.