లోయలో పడిన బస్సు.. ముగ్గురి మృతి (వీడియో)

21చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో శివార్లలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య ఎక్స్‌ప్రెస్‌వే తొలి టోల్ ప్లాజా సమీపంలో బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 44 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 31 మందిని లోక్ బంధు ఆస్పత్రికి, 13 మందిని కేజీఎంయూ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్