ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్–కేల్హరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 నుండి 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, పహాడీహంస్వాహి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.