గోతిలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రమాదం (వీడియో)

21చూసినవారు
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తుంబాడి పెట్రోల్ బంక్ సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. పావగడ నుండి తుమకూరు వెళ్తున్న ఈ బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన ఆవును తప్పించేందుకు ముందు వెళ్తున్న కారు వేగాన్ని తగ్గించింది. దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై కారును ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్