వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

83చూసినవారు
వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం
TG: ఓ మహిళా వ్యాపారవేత్త తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. హైదరాబాద్ మణికొండకు చెందిన వ్యాపారవేత్త మడుగుల దీప్తి రెడ్డి (42) ఈ నెల 22న మెదడులో రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరగా చికిత్స అనంతరం 26న బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. భర్త ప్రదీప్ రెడ్డి అవయవదానానికి ముందుకొచ్చారు. దీప్తి రెడ్డి రెండు కిడ్నీలు, కాలేయం, గుండె దానం చేయడంతో నలుగురు రోగులకు అవయవాలు అందనున్నట్లు జీవన్‌దాన్ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్