రాడ్లతో క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. ముగ్గురు అరెస్ట్

48చూసినవారు
రాడ్లతో క్యాబ్ డ్రైవర్‌పై దాడి.. ముగ్గురు అరెస్ట్
TG: బాపూఘాట్ లంగర్‌హౌజ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రాపిడో డ్రైవర్ ఇర్ఫాన్ ఖురేషీ (32)పై ముగ్గురు కార్మికులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. దొంగతనం అనుమానంతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఇర్ఫాన్‌కు రెండు కాళ్లు, కాలర్ బోన్ విరగడంతో చికిత్స పొందుతున్నాడు. ఈఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుడికి న్యాయం, మెరుగైన వైద్యం అందేలా అసదుద్దీన్ ఒవైసీ జోక్యం చేసుకోగా.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పోలీసులను, ఆస్పత్రి అధికారులను సంప్రదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్