నెయిల్ పాలిష్, టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందని చెప్పలేమని డెర్మటాలజిస్ట్లు చెప్తున్నారు. అయితే వీటిలోని కొన్ని రసాయనాలు, ముఖ్యంగా పాత నెయిల్ పాలిష్లలో ఉండే ఫార్మాల్డిహైడ్, టోలుయీన్, డిబుటైల్ థాలేట్ వంటి పదార్థాలను అధికంగా, తరచూ ఉపయోగించడం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. టాల్క్లో ఆస్బెస్టాస్ కలిసే అవకాశం ఉన్న సందర్భాల్లో దాన్ని దీర్ఘకాలం పీల్చడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరగొచ్చని పేర్కొంటున్నారు. అయితే ప్రతి టాల్కమ్ పౌడర్, నెయిల్ పాలిష్ క్యాన్సర్కు కారణమవుతుందని చెప్పలేమని, నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.