విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను సరైన విధంగా ఉపయోగిస్తే చదువును మరింత సులభతరం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, నోట్‌బుక్‌ఎల్‌ఎం వంటి సాధనాలతో కఠినమైన పాఠాలను సులభంగా అర్థం చేసుకోవడం, వ్యక్తిగత స్టడీ ప్లాన్ రూపొందించుకోవడం, నోట్స్ తయారు చేయడం, ప్రాక్టీస్ ప్రశ్నలు సాధించడం వంటివి చేయవచ్చు. మాక్ టెస్టుల ద్వారా సమాధానాల్లోని తప్పులను గుర్తించి, బలహీనమైన అంశాలపై మరింత దృష్టి పెట్టవచ్చు. అయితే ఏఐ ఇచ్చే సమాచారాన్ని ధృవీకరించడంతో పాటు పాఠ్యపుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా సొంతంగా ఆలోచించడం, రాసి సాధన చేయడం కూడా అవసరం.