ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణతో పాటు నెలకు రూ.16,650 స్టైపెండ్ అందిస్తారు.