భారీగా తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు

24చూసినవారు
భారీగా తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు
కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 35 పేటెంట్ మందులతో సహా మొత్తం 110 క్యాన్సర్ ఔషధాల ధరలపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్ట చిల్లర ధరలో 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయం ద్వారా మందుల ధరలు 70 శాతం వరకు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులు నవంబర్ 9, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్య వల్ల దేశంలోని క్యాన్సర్ రోగులకు ఏటా సుమారు రూ.2,500 కోట్ల మేర ఆర్థిక ఆదా చేకూరనుంది.

సంబంధిత పోస్ట్