
'ది ప్యారడైజ్’ షోలో మైనర్లపై పోలీసుల తనిఖీలు.. గంటకు పైగా నిలిచిన షో
హైదరాబాద్లోని సుచిత్ర టీఎన్ఆర్ మల్టీప్లెక్స్లో 'A' సర్టిఫికేట్ పొందిన 'ది ప్యారడైజ్' సినిమాను మైనర్లకు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదుతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులు మైనర్లను బయటకు పంపేందుకు ప్రయత్నించగా, టికెట్లు విక్రయించేటప్పుడే వయసు నిబంధనలు ఎందుకు తనిఖీ చేయలేదని తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ గందరగోళం కారణంగా గురువారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రదర్శన గంటకు పైగా నిలిచిపోయింది. ఈ సంఘటనతో మల్టీప్లెక్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.




