ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో రూ.2 వేల డీజిల్ బిల్లు అడిగినందుకు పెట్రోల్ పంప్ సేల్స్మన్ను స్కార్పియో వాహనంతో సుమారు 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. కారుకు చిక్కుకున్న సిబ్బందిని రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లి ఆ తర్వాత కిందకు తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబర్ 2న జరిగిన ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు కేసు నమోదు చేసి, స్కార్పియో డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.