TG: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. లచ్య తండాకు చెందిన బానోత్ సోమా, పద్మ దంపతులు బుధవారం బైక్పై వెళ్తుండగా తండా ధర్మారం స్టేజీ సమీపంలో వేగంగా వచ్చిన కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్పరిణామంతో లచ్య తండాలో విషాదం నెలకొంది. స్థానికులు ఈ విషాదకర ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.