AP: కర్ణాటకలోని కనుమపల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గొల్లపల్లికి చెందిన ముగ్గురు కూలీలు మృతి చెందారు. కర్ణాటకలోని పావుగడ నుంచి మడకశిర వస్తుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు కూలీలు స్పాట్‌లో మృతి చెందారు. మృతులు శ్రీనివాసులు (45), నరసింహమూర్తి (35), మేగేష్ (20)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.