కల్వర్టును ఢీకొట్టిన కారు.. నలుగురు స్పాట్ డెడ్ (వీడియో)

11చూసినవారు
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని బెంగళూరుకు బయల్దేరిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు.. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో శారదమ్మ (70), దీక్షిత (25), దేవేంద్ర (41), జిష్ణు (13) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు వికాస్, నీతూ, ఆద్వికలకు గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్