ఈ నెల 17న కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళూరులో వేగంగా దూసుకొచ్చిన కారు హైవోల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మారోళిలోని ఎన్‌హెచ్-73పై ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి.