ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి

19చూసినవారు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా జైంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ లేన్‌లో ఆగి ఉన్న ఒక డంపర్ లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 9మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా రాత్రిపూట గోవర్ధన్, గిరిరాజ్ జీ పరిక్రమ (పుణ్యక్షేత్ర ప్రదక్షిణ) పూర్తి చేసుకుని ఉదయాన్నే తిరుగు ప్రయాణమయ్యారని మథుర ఎస్ఎస్‌పీ శ్లోక్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్