స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

25చూసినవారు
స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
TG: హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో చిన్నారికి గాయాలయ్యాయి. మృతులను పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన రేఖ, నవీన్​గా గుర్తించారు. చెల్లిని దసరాకు శంషాబాద్ నుంచి తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్