తమిళనాడులో చెట్టును ఢీ కొట్టిన కారు.. 8 మంది మృతి

2చూసినవారు
తమిళనాడులో చెట్టును ఢీ కొట్టిన కారు.. 8 మంది మృతి
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు. నమక్కల్ జిల్లాలో ఓ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వేప చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్