జగిత్యాల – ధర్మపురి ప్రధాన రహదారిపై కల్లెడ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు మరణించగా, మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.