మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లా నల్కేద వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ జలపాతంలోకి కారు దూసుకెళ్లడంతో భువనేశ్వర్కు చెందిన ఎనిమిది మంది ఒకే కుటుంబ సభ్యులు మరణించారు. వీరు ఉజ్జయిని బగళాముఖి అమ్మవారి దర్శనానికి కారులో బయలుదేరగా, మార్గంమధ్యలో నల్కేద వద్ద కారు అదుపుతప్పి జలపాతంలోకి దూసుకెళ్లింది. మృతులలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారు.