గుజరాత్‌లోని మెహసానా జిల్లా, కడి ప్రాంత పరిధిలోని మేడ అద్రజ్ గ్రామం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలబడి లస్సీ తాగుతున్న ఇద్దరు కార్మికులపైకి అతివేగంగా వచ్చిన ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.