మధ్యప్రదేశ్ రత్లాంలోని బంజలి-సెజావతా బైపాస్పై గేటు నం.192 వద్ద ఓ కారు రైల్వే గేటు దాటే ప్రయత్నం చేస్తుండగా.. సిబ్బంది గేటు వేయడంతో పట్టాలపై చిక్కుకుపోయింది. ఇంతలో వల్సాద్ - హిసార్ ఎక్స్ప్రెస్ (04728) దూసుకొచ్చి కారును ఢీకొట్టింది. అయితే లోకో పైలట్ ముందుగానే కారును గమనించి వేగం తగ్గించడంతో, కారులోని వారు ముందుగానే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే గేటు స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.