TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ పీఆర్ఓ మహేష్‌పై బొల్లారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 8న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. ఏసీపీని దూషించడం, కేకలు వేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.