మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని లాల్భాయి ఫూల్భాయి ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్ కుమార్తె (19) ఇంటి బయట ఉండగా, నంబర్ ప్లేట్ లేని బ్లాక్ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినా దుండగులు ఆమెను కారులో ఈడ్చుకెళ్లి పరారయ్యారు. ఈ దారుణ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.