63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీడీపీఓ

16చూసినవారు
TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీఓ దరోజు పద్మ రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు రాయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. నగదు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేసి కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్