
కరీంనగర్ KFCలో దాడులు.. 90 కేజీల నాణ్యతలేని నూనె సీజ్
కరీంనగర్‌లోని ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ కేంద్రం KFC అవుట్‌లెట్‌లో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నాణ్యత లేని నూనెను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. సుమారు 90 కేజీల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల సమయంలో నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, మీడియా ప్రతినిధులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో, ఆహార పదార్థాలు, ముడిసరుకుల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.




