పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో థర్మల్ కోక్, పెట్కోక్ కొనుగోలు, దిగుమతుల ఖర్చు 20% పెరిగింది. దీని ప్రభావం విద్యుత్, ఇంధన ధరలపై పడుతోంది. ఈ పరిణామం దేశీయ సిమెంట్ కంపెనీలపై భారం పెంచుతుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. రాబోయే 2-3 నెలల్లో సిమెంట్ ధరలు టన్నుకు ₹150-200, బస్తాకు ₹10-15 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది నిర్మాణ రంగాన్ని ప్రభావితం చేయవచ్చు.